సినీ నటి రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లు..

Over 100 bottles of liquor seized from actress Ramya Krishnan s car

ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి రమ్యకృష్ణ కారులో మద్యం తరలిస్తూండగా పోలీసులు పట్టుకున్నారు.. ప్రస్తుతం చెన్నై లో నివసిస్తున్న రమ్యకృష్ణ కారు ను పోలీసులు శనివారం మధ్యాహ్నం తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో మద్యం పట్టుబడింది. చెన్నై లోని ఈసీఆర్ రోడ్డు మీదుగా ఈ కారు వెళ్తుండగా పట్టుకున్నారు.

తనిఖీల్లో 8 విసుకీ ఫుల్లు బాటిళ్లు, 96 మినీ కింగ్ ఫిషర్ బీరు బాటిళ్లు లభించాయి. దీనితో పోలీసులు డ్రైవర్ సెల్వ కుమార్ ని అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేశారు. ప్రస్తుతం చెన్నై లో మద్యం అమ్మకాలకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో వేరే చోటు నించి ఈ మద్యం తీసుకొస్తున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉంటె పోలీసులు కారును తనిఖీ చేసే సమయంలో రమ్యకృష్ణ తన సోదరి తో కలిసి ప్రయాణిస్తున్నారని సమాచారం