చిన్న నిర్మాతలకు గుర్తింపు లేని తెలుగు సినీ పరిశ్రమ

Telugu film industry is not recognized by small producers

అవును చిన్న నిర్మాతలకు ఇండస్ట్రీ కి సంబందించిన సమావేశాల్లో పిలుపులుండవు... వారు  ఏం నిర్ణయాలు తీసుకున్నారో సమాచారం ఉండదు. చిన్న నిర్మాతలు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది.  తెలుగు రాష్ట్రాలలో సినిమా షూటింగ్ లకు అనుమతులు లభించడంతో ఇప్పుడు సగం నిర్మాణం జరుపుకుని ఆగిన సినిమాల నిర్మాతల దృష్టి అంతా తమ సినిమాలను ఎలా వేగంగా పూర్తి చేయాలి అన్నవిషయమై ఇప్పుడు తమ యూనిట్ సభ్యులతో లోతైన చర్చలు చేస్తున్నారు. ఒకవైపు కరోనా సమస్యల రీత్యా ప్రభుత్వాలు విధించిన గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూ నటీనటులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ధైర్యం చెపుతూ షూటింగ్ లు నిర్వహించడం ప్రస్తుతం నిర్మాతలందరికీ కత్తి మీద సాములా తయారైందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈమధ్య సినిమా షూటింగ్ ల ప్రారంభానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశాలకు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదనీ చిన్న నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.  ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా నడపబడుతున్న ఇండస్ట్రీ వ్యవహారాలలో తమ గోడువినే నాధుడు కూడ లేడు అని చిన్న నిర్మాతలు మధన పడుతున్నట్లు టాక్.  దీనికితోడు ప్రస్తుతం చిరంజీవి చుట్టూ ఉన్నది పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకున్న ఆ నలుగురు మినహా ఏ ఒక్క చిన్న నిర్మాత చిరంజీవి దగ్గరకు వెళ్ళలేకపోతున్నారని అనేక మంది చిన్న నిర్మాతలు బాధపడుతూ తమ వ్యధను వినే నాధుడే లేడని నిట్టూర్పులు విడుస్తున్నట్లు టాక్.  

దీనికితోడు ఈమధ్య ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన సమావేశాలలో ఒక్క చిన్న నిర్మాత కూడ చోటు దక్కకపోవడం అన్యాయం అంటూ చిన్న నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు అన్న రెండు వర్గాలుగా విడిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. వాస్తవానికి ఈ వర్గపోరు కరోనా పరిస్థితులు ముందు కూడ ఇండస్ట్రీలో కనిపించినా ఇప్పుడు కరోనా వల్ల ఇండస్ట్రీ అంతా అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలతో ఒక విధంగా హీరోలకు దర్శకులకు మిగతా సాంకేతిక నిపుణులను  25 శాతం డిస్కౌంట్ అడగతంతో నిర్మాతలకు మినహా  ఇండస్ట్రీ కి  షాక్ తగిలింది. ఈ నెపంతో నిర్మాతలంతా ఒక వర్గం గా ఏర్పడుతారని టాలీవుడ్ భావిస్తుంది. ఏమైనా పెద్ద నిర్మాతలు ఒక  వైపు చిన్న నిర్మాతలు ఒక వైపు... సినిమా ఇండస్ట్రీ లో వర్గ పోరు మొదలైంది.   

 


                    Advertise with us !!!