
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్లోని తన నివాసంలోకి స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. సిద్దిపేటలో ఆయన నివాసంలో వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో మంత్రికి, 17 మందికి నెగెటివ్ వచ్చింది.