సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

PM Modi Video Conference with CMs

కరోనా కట్టడి, లాక్‍డౌన్‍ సడలింపు తదితర అంశాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మాట్లాడనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో రెండు గ్రూపులుగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై సమీక్షించనున్నారు. లాక్‍డౌన్‍లో సడలింపులు ఇచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ, ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. లాక్‍డౌన్‍ ప్రకటించిన తర్వాత సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం ఇది ఆరోసారి.

 


                    Advertise with us !!!