
మన డీఎన్ఏ సహనం. మనం కొత్త ఆలోచనలను అంగీకరించాలి. సహనం అనే విధానంపైనే భారత్, అమెరికా సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుతం ఆ డీఎన్ఏ భారత్‌లోనూ, అమెరికాలోనూ నశిస్తోంది. ఇది బాధాకరం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నికోలస్ బర్నస్తో మాట్లాడారు.