
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సియాటెల్ మేయర్ జెన్నీ దుర్కాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సియాటెల్‌లో జాతివివక్ష వ్యతిరేక ఆందోళనలకు సంబంధించి అక్కడి పాలనా యంత్రాంగం స్వయంప్రతిపత్తి జోన్ ఏర్పాటు చేయడంపై ట్రంప్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై జెన్నీ స్పందించారు. మీరు మీ బంకర్లోకి తిరిగి వెళ్లిపోండి. మమ్మల్ని సురక్షితంగా ఉంచండి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ ఎదుట తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సమయంలో ట్రంప్ భయపడి ఆ భవనంలో ఉన్న ఒక బంకర్లోకి వెళ్లి దాక్కున్నాడని పలు మీడియా సంస్థలు పేర్కొన్న విషయం తెలిసిందే. మరో వైపు ట్రంప్ వ్యాఖ్యలపై వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్ల్సే కూడా స్పందించారు. పాలన చేతకాని వ్యక్తి వాషింగ్టన్ రాష్ట్ర వ్యవహారాలకూ దూరంగా ఉండాలని, ట్వీట్లు చేయడం మానుకోవాలని అన్నారు.