
కరోనా మహమ్మారిపై క్యూబా సాధించిన విజయాన్ని అమెరికా ఓర్చుకోలేకపోతుందని, అందువలనే తమ దేశంపై దూకుడు ప్రదర్శిస్తోందని క్యూబా విదేశాంగ శాఖకు చెందిన యుఎస్ డిపార్ట్మెంట్స్ డైరెక్టర్ జనరల్ కార్లోస్ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ట్రంప్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కరోనా నియంత్రణలో క్యూబా సానుకూల ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు. తమ విజయాన్ని తట్టుకోలేని అమెరికా ప్రభుత్వం ఇతర క్యూబా వ్యతిరేక శక్తులు, రాజకీయ నేతలు పలు విధాలుగా దాడులు చేస్తున్నారని అన్నారు.