
కొవిడ్ టెస్టింగ్ కేంద్రాలను కనుక్కోవడం ఇప్పుడు సులభం కానుంది. కొవిడ్ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, అసిస్టెంట్‌లో కొవిడ్ టెస్టింగ్ అని టైప్ చేసి దగ్గరలో ఉన్న టెస్టింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. తెలుగు సహా 9 భాషల్లో ఈ సేవలు పొందవచ్చని గూగుల్ వెల్లడించింది.