పోలీస్ సంస్కరణలకు డొనాల్డ్ ట్రంప్ రెడీ!

trump-unveils-reform-proposals-as-protests-against-police-brutality-continue

పోలీస్‍ శాఖలో కీలక సంస్కరణలు చేపట్టేందుకు ఉద్దేశించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ పేర్కొన్నారు. ఆఫ్రికన్‍- అమెరికన్‍ జార్డ్ ఫ్లాయిడ్‍ దారుణ హత్య నేపథ్యంలో అమెరికాలో పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులను అదుపు చేయడంలో పోలీస్‍లు విఫలమవ్వడంతో పటుచోట్ల ఉద్రికత్తలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీస్‍ శాఖ తమ బలగాల్ని వినియోగించుకోవడంలో మరింత మెరుగుపడాల్సిన అవసరమున్నదని ట్రంప్‍ అభిప్రాయపడ్డారు. గత రెండు వారాలుగా జరిగిన పరిణామాలు చాలా అవమానకరంగా ఉన్నాయి. నిరసనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో అత్యధికులు పోలీసు అధికారులే అని డల్లాస్‍లో నిర్వహించిన రౌండ్‍ టేబుల్‍ సమావేశంలో ట్రంప్‍ పేర్కొన్నారు. తమ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపర్చుకునేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులను ఖరారు చేయడానికి కృషి చేస్తున్నాం. నిరసనలను అణచివేయడానికి కుయుక్తులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి అని ఆయన తెలిపారు.