రుచి, వాసన తగ్గిపోయిన వెంటనే పరీక్ష

Govt considering to include sudden loss of taste smell as criteria for Covid 19 test

వ్యక్తుల్లో ఉన్నట్టుండి రుచి, వాసన శక్తి తగ్గపోవటాన్ని కొవిడ్‍- 19 పరీక్షకు ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ అంశంపై కొవిడ్‍- 19 టాస్క్ఫోర్స్ గత ఆదివారం సమావేశం నిర్వహించింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. అమెరికాకు చెందిన సీడీసీ కూడా గత నెలలో ఇదే అంశాన్ని వెల్లడించింది. రుచి, వాసన తగ్గిపోయిన వెంటనే పరీక్ష నిర్వహించటం వల్ల పాజిటివ్‍ వచ్చిన తర్వగా వైద్యం ప్రారంభించవచ్చని టాస్క్ఫోర్స్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

 


                    Advertise with us !!!