
రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఒక్లహామాలో ఈ నెల 19న జరిపే ర్యాలీతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో పాల్గొనదలచినవారు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఆ సందర్భంగా అందులో ఓ డిస్ల్కెయిమర్ కనబడుతోంది. మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు. ఒకవేళ కరోనా సోకితే ర్యాలీ నిర్వాహకుల పూచీ లేదు అన్నది దాని సారాంశం. ఒక్లహామా పాలక రిపబ్లికన్లకు బాగా పట్టున్న ప్రాంతం. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ ఏకపక్ష విజయం సాధించింది. కాగా ర్యాలీ తేదీని మార్చుకోవాలని ప్రత్యర్థులు ట్రంప్‌ను డిమాండ్ చేస్తున్నారు.