ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్తో ఉండాల్సింది కాదు...

white-house-milley-apology

ఈ నెల 1న వైట్‍హౌస్‍ ఎదుట ఆందోళనకారులపై జరిగిన దాడికి సంబంధించిన సమయంలో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో కలిసి ఉండడంపై ఆ దేశ జాయింట్‍ చీఫ్స్ స్టాఫ్స్ చైర్మన్‍ జనరల్‍ మార్క్ మిల్లే స్పందించారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండాల్సింది కాదని, అటువంటి వాతావరణంలో తాను అక్కడ కనిపించడం దేశీయ రాజకీయాల్లో మిలటరీ ప్రమేయానికి సంబంధించి చర్చ జరిగే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. వైట్‍హౌస్‍ సమీపంలోని ఒక చర్చ్కు ట్రంప్‍ వెళ్లేందుకు పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఆందోళనకారులపై బాష్పవాయువు, రబ్బర్‍ బులెట్లు ప్రయోగించి చెదరగొట్టిన విషయం తెలిసిందే. పొలిటికల్‍ షో కోసం ట్రంప్‍ చేతిలో బైబిల్‍ పట్టుకొని వైట్‍హౌస్‍ నుంచి చర్చ్ వరకు అధికారులతో కలసి కాలినడకన వెళ్లారు. ఇటువంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడంపై మిల్లేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది కూడా ఆయన యూనిఫాం ధరించం ఉండడం గమనార్హం. సాధారణంగా వైట్‍హౌస్‍లో జరిగే సమావేశాల సందర్భంగానే మిలటరీ అధికారులు ఈ యూనిఫాం ధరిస్తారు.

 


                    Advertise with us !!!