ప్రభాస్ సినిమాలో ప్రణీత?

praneetha to romance with prabhas

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఒక్క హిట్టు కొట్టామా లేదా అన్నది ముఖ్యం. చేసింది ఒక సినిమా అయినా సరే తెలుగులో కొందరు హీరోయిన్ లకు మంచి గుర్తింపు వస్తుంది. ఉదాహరణకు నాగార్జున గీతాంజలి తీసుకోండి, ఆ చిత్రంలో గిరిజ కు ఎంతపేరు వచ్చింది. వెంకటేష్ సుందరకాండ తీసుకోండి ఆ చిత్రం లో అపర్ణకు కూడా అంతే పేరు వచ్చింది. అగ్ర హీరోల సినిమాల్లో చేసే చిన్న చిన్న పాత్రలు కూడా వాళ్లకు మంచి పేరు తీసుకుని వస్తాయి అని చెప్పవచ్చు. మన తెలుగులో కొందరు హీరోయిన్ లు ఇటీవలి కాలంలో ఇలాగే మన తెలుగులో ఫేమస్ అయ్యారు అని చెప్పాలి. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ ప్రణీత సుభాష్. ఆమె సినిమాలు ఎక్కువగా లేకపోయినా ఆమెకు మాత్రం మంచి ఫాలోయింగ్ అనేది తక్కువ కాలంలోనే వచ్చింది.

అగ్ర హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటించడం ఆమెకు బాగా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసినా సరే ఆమెకు మాత్రం మంచి ఆఫర్లు వచ్చాయి అనేది వాస్తవం. రెండు మూడు సినిమాల్లో ఆమెకు ప్రధాన పాత్రలో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం వాటిల్లో నటించలేదు. ప్రస్తుతం ఆమె మన తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆమె తమిళంలో రెండు సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి ప్రస్తుతం. అక్కడ అగ్ర హీరోయిన్ గా ఆమె ఉంది అని అంటారు గాని పెద్దగా ఆమె మాత్రం సినిమాల్లో కనపడటం అనేది చాలా వరకు తక్కువే.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె ఒక రెండు సినిమాలను తెలుగులో ఓకే చేసింది అని సమాచారం. ప్రభాస్ సినిమాలో ఒక పాత్రలో నటిస్తుంది అని, ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాలో ఆమె షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 


                    Advertise with us !!!