
కరోనా కేసులు లక్షల సంఖ్యకు చేరుతున్నాయి. వారికి వీరికి అనే వ్యత్యాసం లేకుండా ఇది పలకరిస్తోంది. అయితే దీని గురించి తీవ్ర భయాందోళనలు అవసరం లేదని, అవగాహన పెంచుకుని తదనుగుణంగా తమని తాము ఆరోగ్యంగాఉంచుకుంటే సరిపోతుందని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. దీనిలో భాగంగా కోవిడ్ బారిన పడితే కలిగే లక్షణాలు దశలవారీగా ఇలా ఉంటాయని వెల్లడిస్తున్నారు...
-తొలిరోజు వికారంగా అనిపిస్తుంది. అయితే ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. అందుకే పసిగట్టడం కష్టమవుతోంది.
-రెండవ రోజున జ్వరం వస్తుంది. ఇది నిదానంగా ఇతర సమస్యల్ని పెంచుతుంది. కాబట్టి జ్వరం వస్తే మాత్రం తప్పక అలర్ట్ అవ్వాల్సిందే.
-మూడవరోజు అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... ..ఈ మూడు లక్షణాలూ కనిపిస్తాయి. జ్వరం కూడా పెరుగుతుంది. నాల్గవ రోజు కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. పెద్ద వయసు వారు, శ్వాస కోస వ్యాధులు ఉంటే మరింతగా ఇబ్బంది కలుగుతుంది.
-తర్వాత 5, 6 రోజుల్లో పై లక్షణాలన్నీ మరింత తీవ్రత సంతరించుకుంటాయి. ఆలస్యం చేయకుండా మొదటి ఆరు రోజుల్లోపే ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే... పరిస్థితి మరింత జఠిలం అవుతుంది.
-తర్వాత 7 లేదా 8వ రోజు వరకూ చికిత్స ప్రారంభం కాకపోతే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్.(ARDS) అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో ఊపిరి తిత్తులు మరింతగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.అయితే ఆ అవకాశం 2 శాతమే.
-తర్వాత 9వ రోజూ ARDS సమస్య మరింత పెరుగుతుంది. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. దీంతో పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. అయితే ఈ దశలో కూడా చనిపోయేది 2 శాతమే.
ఏదేమైనా... కరోనాను విజయవంతంగా ఎదర్కోవాలంటే ముందస్తుగా మేలుకోవడం ఓ మంచి మార్గం. మొదటి వారంలోనే గానీ ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి... డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.