
కరోనా వైరస్ నియంత్రణ కోసం జికె స్పందన చారిటబుల్ ట్రస్ట్, తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రు శానిటైజర్ మిషన్లను వివిధ ప్రభుత్వ శాఖలకు అందజేశారు. దీని కోసం ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు. అర్బన్ ఎస్పీ, సబ్ కలెక్టర్, సెంట్రల్ జోన్ డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ, రాజమహేంద్ర వరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, త్రీటౌన్ స్టేషన్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, యిన్నమూరి రాంబాబు, మజ్జి రాంబాబు, కురగంటి సతీష్, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు శానిటైజర్ మిషన్లను అధికారులకు అందజేశారు. అమెరికాలో ఉన్న తానా ప్రతినిధి చుండ్రు సతీష్, జికె. స్పందన చారిటబుల్ ట్రస్ట్ మంచి ఆలోచనతో అధికారుల, వైద్యుల, పోలీసుల ఆరోగ్య భద్రత కోసం శానిటైజర్ మిషన్లు అందజేయడం అభినందనీయమని అధికారులు అన్నారు.