మ‌ల‌యాళంలో మ‌రో ఐశ్వ‌ర్యా రాయ్‌!

aishwarya-rai-viral-doppelganger-amrutha-actress-of-piccaso

మ‌నిషిని పోలిన మ‌నిషి ఉండ‌డం స‌హ‌జ‌మే. అలాగే సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌ను పోలిన హీరోయిన్లు కూడా ఉంటారు. అందుకు చాలా మంది ఉదాహ‌ర‌ణ‌లుగా ఉన్నారు. శ్రీ‌దేవి పోలిక‌ల్లో ఉన్న దివ్య‌భార‌తి బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఐశ్వ‌ర్యారాయ్ పోలిక‌ల‌తో ఉన్న స్నేహా ఉల్లాల్‌ను బాలీవుడ్‌కు స‌ల్మాన్‌ఖాన్ ప‌రిచ‌యం చేశాడు. స్నేహ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో న‌టించినా అంత గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ఇప్పుడు తాజాగా మ‌రో ఐశ్వ‌ర్యారాయ్ మ‌ల‌యాళంలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అమృతా సాజు అనే అమ్మాయి అచ్చు ఐశ్వ‌ర్యారాయ్ లాగే ఉండ‌డం, ఐశ్వ‌ర్య న‌టించిన సినిమాల్లోని వాయిస్‌కి అమృత టిక్‌టాక్ వీడియోలు చేయ‌డం ద్వారా ఎంతో పాపుల‌ర్ అయిపోయింది.

ఇప్పుడు అమృత చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌న అంద‌చందాల‌తో, అభిన‌యంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న అమృత ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీకి కూడా ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తోంది. టిక్‌టాక్‌లో ఆమె చేసిన వీడియోల‌ను చూసిన ఓ నిర్మాత హీరోయిన్‌గా ఆమెకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. దీంతో కేర‌ళ సినిమా ఇండ‌స్ట్రీలో అమృత పేరు ఒక్క‌సారిగా మారుమోగిపోతోంది. ఐశ్య‌ర్యా రాయ్ ఫీచ‌ర్స్ క‌లిగి ఉండ‌డం త‌న అదృష్ట‌మ‌ని, తాను వీడియోలు చేయ‌డానికి, సినిమా ఇండ‌స్ట్రీ వ‌ర‌కూ వెళ్ళ‌డానికి త‌న కుటుంబ స‌భ్యులు, మిత్రులు ఎంతో స‌హ‌కారం అందించార‌ని చెబుతోంది అమృత‌. న‌టిగా మంచి పేరు తెచ్చుకోవాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని అమృత చెబుతోంది.