TV Serial Shootings Starts at Ramoji Film City

ప్రపంచ వ్యాప్తంగా కోవిద్ 19 కారణంగా లాక్ డౌన్ తో స్తంభించిన చిత్ర పరిశ్రమలో 80 రోజుల  తర్వాత మళ్లీ పనులు మొదలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం వల్ల టెలివిజన్ ధారావాహికల చిత్రీకరణ ప్రారంభించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ధారావాహిక షూటింగ్  రామోజీ రామోజీ ఫీల్మ్ సిటీ లో  పునఃప్రారంభించారు. సెట్లో కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ ఆ సీరియల్‌ చిత్రీకరణను మొదలుపెట్టారు. లాక్ డౌన్ తో రెండున్నర నెలలుగా మూతపడిన సినీ, టెలివిజన్ పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో ఊరట లభించింది. సగం పూర్తయిన సినిమాలు, అర్ధాంతరంగా నిలిచిపోయిన టెలివిజన్ ధారావాహికలు చిత్రీకరణ చేసుకోవచ్చన్న అనుమతుల మేరకు ప్రపంచ  ప్రఖ్యాత రామోజీ ఫీల్మ్ సిటీలో చిత్రీకరణల సందడి మొదలైంది. ఈటీవీలో ప్రసారమయ్యే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ధారావాహిక చిత్రీకరణను పునఃప్రారంభించారు. పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఎం-సిటీలోని ఓ ఇంట్లో చిత్రీకరణ జరుపుతున్నారు. కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్ చేయడం.. ఆ ధారావాహికలో నటిస్తోన్న నటీనటుల్లో ధైర్యాన్ని నింపింది. లాక్డౌన్ అనంతరం తొలిసారిగా రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతున్న చిత్రీకరణలపై విశేషాలు. షూటింగ్ జరిపిన తీరు తెన్నులు ఇవి....  

* సురక్షిత వాతావరణంలో  షూటింగ్'
* రియల్ చిత్రీకరణలో పాటిస్తున్న జాగ్రత్తలు
* చిత్రీకరణ జరిపే లొకేషన్ బయట, లోపల పూర్తిగా శానిటైజ్ చేశారు.
* సెట్లోకి వచ్చే సిబ్బంది, నటీనటులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు.
* శరీర ఉష్ణోగ్రతల నమోదుతోపాటు శానిటైజర్, మాస్క్లు పంపిణీ చేశారు.
* సెట్లో డిస్ ఇన్ ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు.
* చిత్రీకరణకు ఉపయోగించే కెమెరాలు, ఇతరత్రా వస్తువులను శానిటైజ్ చేశారు.
* నటీనటులకు మేకప్ విషయంలో వ్యక్తిగత సిబ్బంది పీపీఈ కిట్లు ధరించారు.
* పలువురు నటీనటులు వ్యక్తిగత మేకప్ కి  ప్రాధాన్యత ఇచ్చారు.
* అల్పహారం, భోజన విరామ సమయంలో భౌతిక దూరం పాటించారు.
* పలువురు నటీనటులు, సిబ్బంది వ‌్యక్తిగతంగా ఆహారంతోపాటు మంచినీళ్లు కూడా  తెచ్చుకున్నారు.
* చిత్రీకరణ సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ నటిషున్నారు.  
* నటీనటులతోపాటు సెట్లో ఉన్న సిబ్బంది మాస్క్ లు, హ్యాండ్ గ్లౌజ్లు ధరించారు.
* 20 నుంచి 30 మందితోనే రోజంతా చిత్రీకరణ కొనసాగించారు.