అమెరికన్ సంస్థతో జొమాటో ఒప్పందం

Marriott International partners with Zomato

ప్రముఖ ఫుడ్‍ డెలివరీ సంస్థ జొమాటో మరో దిగ్గజ సంస్థతో జత కట్టనుంది. అమెరికాకు చెందిన మారియేట్‍ ఇంటర్నేషనల్‍ (అత్యాధునిక రెస్టారెంట్‍) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‍లో తమ సంస్థను మరింత విస్తరించేందుకు జొమాటోతో పనిచేయనున్నట్లు మారియేట్‍ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మారియేట్‍ ఆన్‍ వీల్స్ పేరుతో క్యాటరింగ్‍ సేవలు, మీల్స్ అందిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లకు వేగంగా పుడ్‍ డెలివరీ సేవలందించడమే తమ లక్ష్యమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. జొమాటో సంస్థతో ఒప్పందం ద్వారా కస్టమర్లకు మరింత వేగంగా సేవలను అందిస్తామని మారియేట్‍ దక్షిణాసియా వైస్‍ ప్రెసిడెంట్‍ నీరజ్‍ గోవిల్‍ పేర్కొన్నారు. మారియేట్‍ సంస్థతో కలిసే పనిచేయడం ద్వారా సంస్థ మరింత వృద్ధిని సాధిస్తుందని జొమాటో పేర్కొంది. కాగా కరోనా వైరస్‍ నేపథ్యంలో ఇరు సంస్థలు శానిటైజేషన్‍కు (శుభ్రత) అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

 


                    Advertise with us !!!