ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల

AP Inter Results 2020 Declared by Minister Adimulapu Suresh

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో ఇంటర్‍ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‍, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‍ ఫలితాలను విడుల చేశారు. ఇంటర్‍ ప్రమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్‍ టికెట్‍ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్‍ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‍లైన్‍లో విడుదల చేసింది. ఇంటర్మీడియట్‍ మొదటి సంవత్సరం పరీక్షలు 5.07 లక్షల మంది విద్యార్థులు రాయగా 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్‍ ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఇంటర్‍ ఫలితాల్లో బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇంటర్‍ ఫలితాల్లో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా ఉండగా, పశ్చిమ గోదావరి, విశాఖ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. మార్కుల మెమోలు వెబ్‍సైట్‍లో పెట్టినట్లు మంత్రి తెలిపారు.