ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత

YSR Cheyutha Scheme Will Start From August 12

ఆంధప్రదేశ్‍లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని పేద మహిళలకు వైఎస్సార్‍ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18.750 చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించబోతోంది. నవరత్నాల అమల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 12న ఈ పథకం ప్రారంభించనున్నారు. దీని కింద వచ్చే నాలుగేళ్లలో లబ్ధిదారులు ఒక్కొక్కరికి సుమారు రూ.75 వేల వరకు ఆర్థికసాయం అందనుంది. మొత్తం 24 లక్షల నుంచి 26 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై ఇలాంటి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.