మీరెన్ని నడిపితే మేమన్ని!

Discussion over RTC Bus Services in AP and Telangana

తెలంగాణ, ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ఆర్టీసీల మధ్య సమాన సంఖ్యలో బస్సులు, కిలోమీటర్ల మేర నడిపే విధానంలో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆంధప్రదేశ్‍తో ఇప్పటి వరకు అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం జరగలేదు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న ఒప్పందమే అమలులో ఉంది. కరోనా తీవ్రతతో నిలిచిపోయిన అంతరాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలతో ఒప్పందం చేసుకున్న తరువాతే అంతరాష్ట్ర సర్వీసులను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్‍ అధికారులకు సృష్టం చేశారు. విధివిధానాలను రూపొందించే పనిలో టీఎస్‍ఆర్టీసీ అధికారులు ఉన్నారు.