
కరోనా వైరస్ కారణంగా గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్లహోమా నుంచి ఎన్నికల ర్యాలీలను వరుసగా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఒక్లహోమా తరువాత టెక్సాస్, ఫ్లోరిడా, అరిజోనా, ఉత్తర కరోలినాల్లో ఎన్నికల ర్యాలీలు సాగిస్తారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ట్రంప్‌కు ప్రధాన ప్రత్యర్థిగా విపక్షం డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ లోకి దిగారు. గత మార్చి 2న చార్లొట్టెలో ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఆ తరువాత ఆయన ఎక్కడికీ వెళ్లలేదు.