
ప్రఖాత భారతీయ అమెరికా భూసార శాస్త్రవేత్త రత్తన్లాల్కు ఈ ఏడాది 250,000 డాలర్ల వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది. ఈ సందర్భంగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైకె పోంపియో రత్తన్లాల్ భూసార శాస్త్ర పరిశోధనలో సాగించిన కృషిని ప్రశంసించారు. ఆహార ఉత్పత్తిని పెంచడం, పోషకాలను తిరిగి వినియోగించడంలో చేసిన పరిశోధనలతో ప్రపంచంలోని కోట్లాది మంది చిన్న తరహా రైతులకు మేలు చేయగలిగారని పేర్కొన్నారు.