
భారత్లో మతపరమైన, మైనార్టీల వర్గాల పైన వివక్షతతో దాడులు జరుగుతున్నాయని అమెరికా ప్రభుత్వ నివేదిక ఆరోపించడాన్ని భారత్ తిరస్కరించింది. విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఆన్లైన్ వీడియో సమీక్షలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైకె పోంపియో వెల్లడించిన నివేదికను తప్పు పట్టారు. తమ దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలు, ఆచరణలు ప్రపంచానికి తెలుసునని, దేశ ప్రజలు, ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు గర్వపడుతుంటారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా భారత ప్రజలకు రక్షణ ఎప్పుడూ ఉంటుందని ఆయన సృష్టం చేశారు.