
ఉభయ కొరియాల మధ్య సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా విదేశాంగ శాఖలో అమెరికా వ్యవహారాల విభాగం డైరక్టర్ జనరల్ క్వాస్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ దక్షిణ కొరియాతో దౌత్య, సహకార సంబంధాలను పునరుద్ధరించాలని అమెరికా కోరడం అనుచితం, అర్థరహితమూనని వ్యాఖ్యానించారు. కొరియా అంతర్గత సంబంధాలపై మాట్లాడే అధికారం బయటివారికెవరికీ లేదని ఆయన చెప్పారు. దక్షిణ కొరియాతో సంబంధాలు ఎలా ఉండాలనేది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని ఉత్త కొరియా అధికారి చెప్పారు.