
వెంటిలేటర్ల తయారీకి నాసా ఎంపిక చేసిన భారతీయ సంస్థల్లో మూడు (ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, మేధా సర్వో డ్రైవ్స్ ప్రై. లిమిటెడ్) హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేవే కావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు, వృద్ధి కోసం పరస్పర సహకారం అవసరమని ట్విటర్లో పేర్కొన్నారు. వెంటిలేటర్ల తయారీకి హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్త్ను మూడు సంస్థలు ఎంపిక కావడంపై హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జొయల్ రీఫ్మాన్ అభినందనలు తెలిపారు.