
- బాబు హయాంపై సిబిఐ దర్యాప్తుకు ఏపీ వినతి
- అక్రమాలే అన్నీ అని తీర్మానించిన కేబినెట్
- వైయస్సార్ చేయూతకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో జరిగిన అవినీతిపై సిబిఐ దర్యాప్తును కోరింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. రాజధాని భూముల విషయంలో ఇప్పటికే బాబు ఆయన అనుచరగణం 4వేల ఎకరాలకు పైగా మోసాలకు పాల్పడ్డారని తేల్చిన నేపధ్యంలో అదే కాకుండా ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్నకానుక, రంజాన్ తోఫా పథకాల్లో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రెండో నివేదికకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలన్న కేబినెట్. తదుపరి దర్యాప్తునకు ఆదేశం. దీనిపై అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐతో దర్యాప్తు కోరాలని నిర్ణయించింది.
మరికొన్ని ఎపికేబినెట్ నిర్ణయాలివే...
- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ. 18,142ల చొప్పున నాలుగేళ్ళ పాటు ఆర్థిక సహాయం. దీనిని ఆగస్టు 12న అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించిన ప్రభుత్వం. ఈ పధకం క్రింద 24 నుంచి 26 లక్షలమంది లబ్ధిదారులు ఉంటారని అంచనా.
- ‘జగనన్న తోడు’ పధకం కింద చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పధకం కింద రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ప్రభుత్వంఅందించనుంది. తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేచిరువ్యాపారులు ఈ పథకం అక్టోబరులో వర్తింపు. దీనికి దాదాపు 9 లక్షలమందికిపైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా. ఏడాదికి దాదాపు రూ. 56 కోట్లు వడ్డీని తాను భరించనున్న ప్రభుత్వం
- తల్లులు, చిన్నారులకు ఇప్పుడిస్తున్న దానికంటే అదనపు పౌష్టికాహారం. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం 77 మండలాల్లో వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల వైయస్సార్ సంపూర్ణ పోషణను అమలు చేయనున్న ప్రభుత్వం
- ఈ ఏడాది గర్భవతులు, తల్లులు, పిల్లల పౌష్టికాహారం కోసం 1863.11 కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం. దీనికి గాను 2018–19లో చేసిన ఖర్చు రూ. 762 కోట్లు, 2019–20లో రూ. 1076 కోట్లు
- ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు చేర్పులు ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునేలా మార్పులు చేర్పులు
- విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపు, కేబినెట్ ఆమోద ముద్ర
- బిల్డ్ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాలæ అమ్మకానికి విశాఖపట్నంలో 7, గుంటూరులో 4 స్థలాల విక్రయానికి అంగీకరించిన కేబినెట్
- గుంటూరులో 1, విశాఖలో 3 చోట్ల గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్త ఎన్బీసీసీ ద్వారా అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం. డెవలప్ చేసిన తర్వాత వీటిని ఇ–వేలం ద్వారా విక్రయించనున్న ప్రభుత్వం.
- ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదమద్ర
- విజయనగరం జిల్లా కురుపాం మండలంలో రూ. 153.853 కోట్ల ఖర్చుతో జేఎన్టీయూ కాకినాడ కింద ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
- ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీకింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. తిరుపతిలో ఏర్పాటుకు సూత్రప్రాయ నిర్ణయం
- జగనన్న విద్యా దీవెన కింద ప్రతి త్రైమాసికం పూర్తికాగానే ఫీజురియంబర్స్మెంట్ డబ్బును తల్లులు ఖాతాల్లోకి వేయనున్న ప్రభుత్వం. కాలేజీల్లో వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న చదువులపై తల్లిదండ్రుల సమీక్ష, పరిశీలనకు ఈ విధానం ఉపకరిస్తున్నందన్న ప్రభుత్వం
- గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఏలూరు, ఒంగోలు, తిరుపతిల్లో మరో 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే
- రైతులకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.రైతులకు ఉచిత విద్యుత్, పగటిపూట కరెంటు సరఫరా స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు
- పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగులో భాగంగా ప్రభుత్వానికి రూ. 405 కోట్ల ఆదా కాంట్రాక్టు అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఫైల్ చేయడానికి కేబినెట్ ఓకే. పోలవరం హైడ్రోప్రాజెక్టు ఐబీఎం వాల్యూ రూ.3,216 కోట్లు. 12.6 శాతం లెస్తో రూ. 2811కోట్లకు బిడ్ దక్కించుకున్న మెగా సంస్థ
- ఏపీ అవుట్ సోర్సింగ్ సర్వీస్‌కార్పొరేషన్ కోసం 55 పోస్టులను భర్తీచేసేందుకు కేబినెట్ ఆమోదం.
- దళారీలు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో అవినీతి లేకుండా చూడటానికి చర్యలు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మొత్తం నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
- మధ్యలో కమీషన్లు లాంటివి లేకుండా నేరుగా బ్యాంకుఖాతాలకే జీతాలు జమ
- ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి బెనిఫిట్స్ అందించేలా చూడ్డానికే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు.
- రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఆమోదం
- ఫేజ్ –1 కింద 36 నెలల్లో రూ. 3,736 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక, 802 ఎకరాల్లో తొలిదశ రూ.200 కోట్ల నిధులు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం, రూ.2079 కోట్ల మేర రుణాలు.
- గండికోట నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం
- వెలిగొండ ప్రాజక్టులో ఆర్ అండ్ ఆర్కు రూ. 1301.56 కోట్లు. తీగలేరు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ భూసేకరణకోసం రూ.110 కోట్లు మొత్తంగా రూ. 1411.56 కోట్లు. అమలుకు ఆమోదం
- పన్ను ఎగవేతలపై నిశిత దృష్టి సమర్థవంతమైన చర్యలకు కొత్త విభాగం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఆర్థిక శాఖ పరిధిలో ఈ విభాగం పనిచేస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌కు 55 పోస్టులు
- సన్నిధి యాదవుల వారసత్వపు హక్కులను పరిరక్షించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం
- కర్నూలు జిల్లా పిన్నాపురంలోఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం
- 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అనుమతి, అప్పుడు ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ.2.5 లక్షలు
ఇప్పుడు అదే సంస్థ, అదే ప్రాజెక్టు.. ఎకరాకు రూ. 5లక్షలు చొప్పున ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధం. ఇది కాక ప్రతి మెగావాట్‌కు ప్రతి ఏటా గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జ్ కింద లక్ష రూపాయలు చెల్లింపునకు కంపెనీ అంగీకారం, ఏడాదికి రూ.32కోట్లు ఆదాయం. 25 ఏళ్ల తర్వాత ప్రతి మెగావాట్‌కు 2 లక్షల రూపాయలు చెల్లింపునకు అంగీకారం. ప్రాజెక్టులో భాగంగా 550 మెగావాట్లు విండ్ పవర్, 1200 మెగావాట్ల హైడ్రో, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి
- బోగాపురం ఎయిర్‌పోర్టు 2700 నుంచి 2200 ఎకరాలకు ఎయిర్‌పోర్టు కుదింపు. కుదింపు స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం. తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు. రూ. 3కోట్లు ధర వేసుకున్నా... ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం.
ఈ సందర్భంగా ప్రభుత్వంలో అవినీతి అన్నది లేకపోతే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో పైరెండు అంశాలు నిరూపిస్తున్నాయని కేబినెట్లో ముఖ్యమంత్రి మంత్రులు వ్యాఖ్యానించారు.