ఫోన్‌లో క‌రోనా టెస్టుల రిజ‌ల్ట్స్‌...

Corona Test Result through SMS in Andhra Pradesh

-ఏపీలో కొత్త ప్ర‌క్రియ‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇకపై కరోనా టెస్టుల ఫలితాలు ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందనున్నాయి. ప్రస్తుతం కరోనా నిర్ధారణ టెస్ట్ రిజల్ట్స్ వెల్లడించే విధానంలో ప‌లు లోపాలు తలెత్తుతుండటంతో.. ఈ కొత్త విధానాన్ని తాజాగా అమలులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి కరోనా పరీక్షల చేయించుకున్న తర్వాత ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. వాటిని ఆన్లైన్ ద్వారా వైద్యులు, ఆసుపత్రి సూపరిటెండెంట్లకు తెలియజేస్తారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవి ప‌లు సంద‌ర్భాల్లో  ప్ర‌తికూలంగా మార‌డంతో వాటిని అధిగమించడం కోసమే కరోనా టెస్ట్ ఫలితాలను నేరుగా చేయించుకున్న వ్యక్తి సెల్‌ఫోన్‌కి టెక్ట్స్‌ మెసేజ్ ద్వారా అందజేయనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖ పంపే లింకు ఆధారంగా కూడా కరోనా ఫలితాన్ని తెలుసుకునే అవకాశాన్ని కూడా ఏపీలో కల్పిస్తున్నారు.

 


                    Advertise with us !!!