అగ్రరాజ్యంలో 20 లక్షలు దాటిన కేసులు !

America Crosses 20 lakh COVID 19 Cases

కరోనా మహమ్మారికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. తాజాగా దేశంలో కరోనా పాజిటివ్‍ కేసుల సంఖ్య 20 లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదించింది. ఇప్పటివరకు దేశంలో 20,00,464 పాజిటివ్‍ కేసులు నిర్ధారణ కాగా వీరిలో 1,12,924 మంది మృత్యువాతపడినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‍ 19 వైరస్‍ తీవ్రత అమెరికాలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశంలో ఆంక్షలు సడలించడం, జార్జ్ ఫ్లాయిడ్‍ మృతితో కొన్ని ప్రాంతాల్లో మొదలైన ఆందోళనల నేపథ్యంలో వైరస్‍ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు.

 


                    Advertise with us !!!