
ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యా ఆరోగ్యశాఖలో ఖాళీలను భార్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ, వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 5,701 పోస్టులు, అలాగే 804 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. మరో 2,186 సాఫ్ట్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు వివిధ కేటగిరీలలో 1,021 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.