అమెరికాలో నల్లజాతీయుడికి అందలం

air-force-charles-brown-first-black-service-chief

అమెరికాలో నల్లజాతీయులను ప్రసన్నం చేసుకొనేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా చరిత్రలో తొలిసారిగా మిలటరీ చీఫ్‍గా జనరల్‍ చార్లెస్‍ క్యూ. బ్రౌన్‍ జూనియర్‍ను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును అమెరికా సెనేట్‍ (98-0 ఓట్లతో) ఏకగ్రీవంగా ఆమోదించింది. చార్లెస్‍ బ్రౌన్‍ జూనియర్‍ ప్రస్తుతం ఫోర్‍ స్టార్‍ జనరల్‍ హోదాలో అమెరికా వైమానికదళం చీఫ్‍ ఆఫ్‍ స్టాఫ్‍గా ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్‍ అంత్యక్రియలు హ్యూస్టన్‍ నిర్వహించిన రోజునే బ్రౌన్‍ నియామకాన్ని అమెరికా ధ్రువీకరించడం విశేషం.

అమెరికాకు చారిత్రాత్మకమైన రోజు. దేశభక్తుడు, గొప్పనాయకుడు అయిన చార్లెస్‍ బ్రౌన్‍ జూనియర్‍తో మరింత సన్నిహితంగా పనిచేయడానికి సంతోషిస్తున్నాను చార్లెస్‍ బ్రౌన్‍ నియామకం గురించి ట్రంప్‍ ట్వీట్టర్‍లో పేర్కొన్నారు. కాగా, అమెరికాలో శతాబ్దాలుగా ఉన్న జాత్యాహంకారాన్ని పరిష్కరించలేను.. వైమానికదళం సభ్యులను ప్రభావితం చేసిన దశాబ్దాల వివక్షను పరిష్కరించలేను అని బ్రౌన్‍ జూనియర్‍ ఇటీవల ట్విట్టర్‍లో వెల్లడించారు. చార్లెస్‍ బ్రౌన్‍ జూనియర్‍ 1984 లో టెక్సాస్‍ టెక్‍ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‍, 1995లో ఎంబ్రి-రిడ్డిల్స్ ఎరోనాటికల్‍ యూనివర్సిటీ నుంచి సైన్స్ పోగ్రాంలో మాస్టర్‍ డిగ్రీ పొందారు. అనంతరం అమెరికా వైమానికదళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

 


                    Advertise with us !!!