
కరోనాతో విధించిన లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అనేక విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్కేజీ, యూకేజీతో పాటు ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులను నిలిపివేస్తున్నట్టు మంత్రి సురేష్ కుమార్ వెల్లడించారు. కొందరు కేబినెట్ మంత్రులు మాత్రం ఏడో తరగతి వరకు ఈ నిర్ణయాన్ని వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారనీ, అయితే ఇంకా ఈ విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.