రామజన్మభూమిలో రుద్రాభిషేకం

prayer-for-construction-of-rudrabhishekam-uninterrupted-temple

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఉన్న కుబేర్‍ టీలా వద్ద పరమశిడికి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి కుమల్‍ నయన్‍ దాస్‍, ఇతర పండితులు ప్రత్యేక పూజలు చేసి రుద్రాభిషేకం జరిపారు. అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమాలు త్వరగా ప్రారంభం కావాలని ప్రార్థించానని కమల్‍ నయన్‍ దాస్‍ చెప్పారు. పూజా కార్యక్రమాలు జరిగాక శంకుస్థానతో మందిర నిర్మాణ పనులు మోదలవుతాయని కమల్‍ నయన్‍ దాస్‍ తెలిపారు. అయితే, బుధవారం ఆయన జన్మభూమి స్థలంలోని శివుడి గుడికి చేరుకున్నా ఇతర ట్రస్ట్ సభ్యులు హాజరు కాలేదు. దీంతో మణిరామ్‍ చాన్వీ దేవాలయ పండితులతో కలిసి కమల్‍ నయన్‍ దాస్‍ పూజలు మాత్రమే చేశారు. శంకుస్థాన కార్యక్రమాన్ని జరుపలేదు.

 


                    Advertise with us !!!