
కొన్ని దశాబ్దాలుగా పార్టీలో పదవులు, గౌరవం పొందినవారు ఇప్పుడు అధికార పార్టీ వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులతో ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బెదిరింపులు, ప్రలోభాలతో వైకాపా కొందరిని లోబరుచుకుంటోందని ధ్వజమెత్తారు. పార్టీ నుంచి ఒకరిద్దరు పోయినా ఏమీ కాదు. ఒకరు పోతే 100 మందిని తయారు చేస్తాం. టీడీపీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం. నాయకులను తయారు చేసే కార్ఖానా. రాబోయే 40 ఏళ్ల కోసం దీటైన, సమర్థ నాయకత్వాన్ని రూపొందిస్తాం. దానికి తగ్గ ఓపిక నాకుంది. బాధ్యతా నాపై ఉంది అని పేర్కొన్నారు.