ఎండలో ఉంటే కరనా ముప్పు

New study investigates whether the sun's power can slow spread of Covid 19

ఎండ తీవ్రతకు కరోనా వైరస్‍ చచ్చిపోతుంది. మనదగ్గర ఎండ ఎక్కువే కదా. పైగా ఎండాకాలం కూడా. ఎం కాదులే.. ఇవీ మనం మొన్నటి వరకు అనుకున్న మాటలు. కానీ, సూర్యరశ్మి వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది. ఎక్కువసేపు ఎండలో ఉంటే వైరస్‍ వ్యాప్తి వేగంగా జరుగుతున్నదని తెలిపింది. వాతావరణ స్థితిగతులను బట్టి కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నదన్న కోణంలో కెనడాలోని మెక్‍మాస్టర్‍ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో సూర్యరశ్మి ప్రమాదమేనని తేలింది. అయితే, అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్‍ వ్యాప్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. శరీరం తట్టుకునే స్థితిని బట్టి వైరస్‍ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!