బాధితుల కంటే రికవరీ ఎక్కువ

covid-19-recovery-cases-more-active-cases-india

దేశంలో మొట్టమొదటిసారిగా యాక్టివ్‍ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రికవరీ రేటు 48.99 శాతం ఉండడం ఊరట కలిగిస్తోంది. భారత్‍లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 1,33,632 కాగా, డిశ్చార్జ్ అయిన ఇంటికి వెళ్లిన రోగుల సంఖ్య 1,35,206గా ఉంది. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి వైరస్‍తో ఎలాంటి హాని జరగడం లేదని, వారంతా బాగా కోలుకుంటున్నారని ఢిల్లీలోని సఫ్దర్‍జంగ్‍ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‍ నీరజ్‍ గుప్తా చెప్పారు. మిగిలిన 20శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వస్తోందని, అలా ఆస్పత్రిలో చేరిన రోగుల్లో 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. కోవిడ్‍ 19 సోకితే భయపడాల్సిన పనేమీ లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా పనికి రాదని ఆయన చెప్పారు. భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటిస్తూ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని ఆచరించాలని హితవు చెప్పారు.

 


                    Advertise with us !!!