కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి

DMK MLA J Anbazhagan Who Had COVID 19 Dies In Chennai

కరోనా బారిన పడి దేశంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్‍(62) బుధవారం మృతి చెందారు. వారం కిందటే ఆయనలో కొవిడ్‍ లక్షణాలు కనిపించడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడం గమనార్హం. ఆప్తమిత్రుడిని కోల్పోయానంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‍ సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‍ సేల్వం అన్బళగన్‍ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

 


                    Advertise with us !!!