
రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి Compensatory Afforestation కార్యక్రమాలను నిర్వహించడానికి స్టీరింగ్ కమిటి 603 కోట్లతో వార్షిక ప్రణాళికను ఆమోదించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు.
సి.యస్ అధ్యక్షతన బుధవారం బిఆర్ కెఆర్ భవన్ లో CAMPA 6 వ స్టీరింగ్ కమిటి సమావేశం జరిగింది. స్టీరింగ్ కమిటి Compensatory Afforestation, (CA), Catchment Area Treatment (CAT), Integrated Wild Life Management Plan (IWLM), Net Present Value (NPV) క్యాటగిరి ల క్రింద వివిధ పనులు చేపట్టడానికి ఆమోదం తెలిపిందని సి.యస్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సి.యస్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, పిసిసిఎఫ్ శ్రీమతి శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పిసిసిఎఫ్ లోకేష్ జైస్వాల్, అడిషనల్ పిసిసిఎఫ్ M.C. పర్ గేన్ తదితరులు పాల్గొన్నారు.