
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆలయాల్లో పూజారులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సృష్టం చేశారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారు బోనాలు జరుపుకోవాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ గటాల ఊరేగింపును పూజారులే నిర్వహిస్తారని అన్నారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు కూడా పూజారులే సమర్పిస్తారని సృష్టం చేశారు. ప్రజలెవరూ ఆలయాలకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమిషన్ లోకేశ్ కుమార్, సీపీ మహేష్ భగవత్, జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.