
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే మంజూరు చేసింది. జన్వాడ ఫామ్ హౌస్‌పై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లోని అంశాల ఆధారంగా వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. దీంతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.