govt-issues-detailed-guidelines-for-hotels-hospitality-units-ahead-of-reopening

ఆతిధ్య రంగానికి ఊత‌మిచ్చే క్ర‌మంలో భాగంగా హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ సంబంధిత వ్యాపారాల‌కు స‌డ‌లింపులు ఇచ్చిన నేప‌ధ్యంలో క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు స‌ద‌రు వ్యాపార నిర్వాహ‌కులు పాటించాల్సిన నిర్ధుష్ట నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను కేంద్రం విడుద‌ల చేసింది. వాటి ప్ర‌కారం...

- కంటెమెంట్ జోన్లు లో ఉన్న హోటళ్లు మూసివేయబడతాయి. జోన్ వెలుపల ఉన్న హోటళ్లు  మాత్రమే తెరవడానికి అనుమతించబడుతుంది.
- 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, సహ అన్నారోగ్య పరిస్తితులు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అవసరమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇంట్లో ఉండాలని  హోటల్ మేనేజ్‌మెంట్ సూచించాలి. 
- కోవిడ్‌ ప్రమాదాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన సాధారణ నివారణ చర్యలను  హోటల్  సిబ్బంది, అతిధులు  గమనిస్తూ ఉండాలి.

- సాధ్యమైనంతవరకు వ్యక్తికి వ్యక్తికి మధ్య  కనీసం 6 అడుగుల దూరం పాటించాలి వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ కవర్లు / ముసుగులు మాస్కూలు  వాడటం తప్పనిసరి. 
- చేతులు మురికిగా  లేనప్పుడు కూడా సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి.
- సాధ్యమైన చోట ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల వాడకం (కనీసం 20 సెకన్లపాటు) ఉండాలి
- దగ్గు, తుమ్ము సంధార్భాల్లో  రుమాలు, టిష్యూ పేపర్, మోచేయితో నోరు, ముక్కును కప్పి ఉంచడం, ఉపయోగించిన టిష్యూ పేపర్ సరిగా పారవేయడం వంటివి పాటించాలి. 
- ఎవ‌రైనా స‌రే త‌మ‌కు లేదా స‌మీపంలోని ఇత‌రుల‌కు ఏదైనా అనారోగ్య లక్షణాలు గమనించినపుడు తక్షణం సంబంధిత పర్యవేక్షక అధికారికి తెలియచేయాలి.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. 
- ఆరోగ్య సేతు యాప్ ని  ఉపయోగించాలి.
- హోట‌ల్స్ ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి శానిటైజర్ డిస్పెన్సర్ ను ఏర్పాటు చేయాలి. 
- హోటళ్ళు లో ఎటువంటి అనారోగ్య లక్షణం లేని, ఫేస్ కవర్ / మాస్క్‌లు ఉపయోగించే అతిధులను మాత్రమే లోప‌ల‌కి అనుమతించాలి. 

- సామాజిక దూర నిబంధన అమ‌లు కోసం హోటల్ మేనేజ్‌మెంట్ తగినంత సిబ్బందిని త‌ప్ప‌క నియమించాలి.
- హూట‌ల్‌ సిబ్బంది చేతి తొడుగులు ధరించాలి 
- అధిక ప్రమాదం ఉన్న‌, వయసు పై బడిన వారు, గర్భిణీ ఉద్యోగులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం అవసరమయ్యే ఫ్రంట్-లైన్ పనులలో వారికీ  ప్రాధాన్యత ఇవ్వకూడదు.
- హోటల్ నిర్వహణలో సాధ్యమైన ప్ర‌తి చోట ఇంటి నుండి పని చేయుటకు అనుమతించాలి.
- హోటల్‌లో  పార్కింగ్ స్థలాల వంటి బయటి ప్రాంగణాలలో గుంపులుగా చేరడం  పెద్ద సమావేశాలు / సమ్మేళనాలు నిషేధం
- వాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉంటే ఫేస్ కవర్లు / ముసుగులు, చేతి తొడుగులు ధరించిన ఆపరేటింగ్ సిబ్బందినిదీనికి వినియోగించాలి. వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, కీ.. ల ద‌గ్గ‌ర‌  సరైన క్రిమిసంహారక చర్య తీసుకోవాలి.
- అతిథులు, సిబ్బంది మరియు వస్తువులు / సామాగ్రి తరలింపు కోసం ప్రత్యేక ప్రవేశం మరియు నిష్క్రమణలు ఏర్పాటు చేయాలి.  ప్రవేశానికి  క్యూలో ఉన్నప్పుడు  కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
- క్యూను నిర్వహించడానికి, ప్రాంగణంలో సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి తగిన దూరంతో నిర్దిష్ట గుర్తులు ఏర్పాటు చేయాలి.
- సామాజిక దూర నిబంధనలను అనుసరించి ఎలివేటర్లలో, ఎస్కలేటర్ల లో ఒక వ్యక్తితో వాడకాన్ని మాత్రమే అనుమతిస్తారు
- అతిథి తన గుర్తింపు వివరాలు ప్రయాణ చరిత్ర, వైద్య పరిస్థితి మొదలైనవి నింపి స్వీయ-ప్రకటన ఫారం రిసెప్షన్‌లో అందించాలి. 
- కోవిడ్‌ గురించి నివారణ చర్యలపై పోస్టర్లు / స్టాండీస్ / ఎవి మీడియా ప్రముఖంగా ప్ర‌ద‌ర్శించాలి. 
- అతిథులు చేతులు శుభ్రపరచు కోవడానికి  రిసెప్షన్ వద్ద హ్యాండ్ శానిటైజర్లను తప్పనిసరిగా ఉంచాలి.
- చెక్-ఇన్, చెక్-అవుట్ ల‌ కోసం హోటళ్ళు తప్పనిసరిగా క్యూఆర్‌ కోడ్, ఆన్‌లైన్ ఫారమ్‌లు, ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపులు వంటి కాంటాక్ట్‌లెస్ ప్రాసెస్‌లను అవలంబించాలి. 
- సామాను గదులకు పంపే ముందు సామాను క్రిమిసంహారక చ‌ర్య‌లు చేప‌ట్టాలి. 
- ఎక్కువ ప్రమాదం ఉన్న అతిథులు, అంటే పెద్దవారు, గర్భవతులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలి.
- కంటైనర్ జోన్ లో ఉండే ప్రాంతాలను సందర్శించవద్దని అతిథులకు సూచించాలి.
- ఫేస్ కవర్లు / ముసుగులు, చేతి తొడుగులు, హ్యాండ్ శానిటైజర్స్ వంటి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు. హోటల్  సిబ్బందితో పాటు అతిథులకుకూడా అందుబాటులో ఉంచాలి.

రెస్టారెంట్స్‌...ప్లీజ్ టేక్ కేర్‌...

- వ్యక్తుల మధ్య తగినంత సామాజిక దూరం ఉండే విధంగా రెస్టారెంట్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. 
- పునర్వినియోగపరచలేని మెనూలను ఉపయోగించాలి
- వస్త్ర న్యాప్‌కిన్‌లకు బదులుగా, మంచి నాణ్యత గల  కాగితపు న్యాప్‌కిన్‌ల వాడాలి.
- కాంటాక్ట్‌లెస్ ఆర్డరింగ్ మోడ్ మరియు డిజిటల్ మోడ్ చెల్లింపు (ఇ-వాలెట్లను ఉపయోగించడం) ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- బఫే విందుల స‌మ‌యంలో అతిథుల మధ్య సామాజిక దూర నిబంధనలను పాటించెల చూడాలి.
- భోజనానికి బదులుగా గది లోకి డెలివరీ లేదా టేక్ ఎవేల‌ను ప్రోత్సహించాలి. ఫుడ్ డెలివరీ సిబ్బంది ప్యాకెట్‌ను నేరుగా రిసీవర్‌కు ఇవ్వకూడదు. అతిథి లేదా కస్టమర్ తలుపు వద్ద వదిలివేయాలి 
- హోమ్  డెలివరీల సిబ్బందిని హోటల్ అధికారులు థర్మల్‌గా పరీక్షించాలి.
- అతిథులు రూమ్ సర్విస్ కోసం అంతర్గత సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ ఇంటర్‌కామ్ / మొబైల్ ఫోన్ ద్వారా ఉండాలి  తగినంత సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ గది సేవ (ఏదైనా ఉంటే) అందించాలి. 
- గేమింగ్ ఆర్కేడ్లు / పిల్లలు ఆడే ప్రాంతాలు (వర్తించే చోట) అనుమ‌తించ‌బ‌డ‌వు.
- ఇంటర్ ఎలియా సిపిడబ్ల్యుడి మార్గదర్శకాలను అనుసరించి ఎయిర్ కండిషనింగ్, అన్ని ఎయిర్ కండిషనింగ్ పరికరాల ఉష్ణోగ్రత అమరిక 24-30oC మధ్య పరిధిలో సాపేక్ష తేమ 40- 70% పరిధిలో ఉండాలని స్వచ్ఛమైన గాలి తీసుకోవడం సాధ్యమైనంత వరకు వెంటిలేషన్ ఉండాలి క్రాస్ వెంటిలేషన్ కొరకు తగిన ఏర్పాట్లు చేయాలి.
- ప్రాంగణంలో. లావటరీలు, తాగునీరు, చేతి వాషింగ్ స్టేషన్లు / ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి  సమర్థవంతమైన పారిశుధ్యం నిర్వ‌హించాలి.
- తరచుగా తాకిన ఉపరితలాలు డోర్ నాబ్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, బెంచీలు, వాష్‌రూమ్ ఫిక్చర్స్ మొదలైనవి  సాధారణ క్రిమిసంహారక (1% సోడియం హైపోక్లోరైట్ ఉపయోగించి శుభ్రపరచడం జ‌రుగుతుండాలి.
- అతిథులు  /  సిబ్బంది వదిలిపెట్టిన ముఖ కవర్లు / ముసుగులు / చేతి తొడుగులును సరైన రీతిలో పారచేయాలి.
- అన్ని వాష్‌రూమ్‌లను త‌గిన‌రీతిలో శుభ్రపరుస్తుండాలి. 
- సిబ్బంది / వెయిటర్లు ముసుగు, చేతి తొడుగులు ధరించాలి 
- కస్టమర్ మారిన  ప్రతిసారీ టేబుళ్లు  శుభ్రపరచాలి.
- వంటగదిలో, సిబ్బంది కార్యాలయంలో సామాజిక దూర నిబంధనలను పాటించాలి. కిచెన్స్ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. 

- హోటల్ ప్రాంగణంలో అనుమానితుడు లేదా పాజిటివ్ కేసు న‌మోదైతే...అనారోగ్య వ్యక్తిని ఇతరుల నుండి వేరుచేసి ప్రత్యేక  గదిలో లేదా ప్రదేశంలో ఉంచి వెంటనే సమీప వైద్య సదుపాయాన్ని (హాస్పిటల్ / క్లినిక్) తెలియజేయండి లేదా రాష్ట్ర లేదా జిల్లా హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.  వైద్యుడు వచ్చి పరీక్షించే వరకు ముసుగు / ముఖ కవర్ ఇవ్వాలి. వ్యక్తి కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన త‌ర్వాత మ‌రోసారి  హోటల్ ప్రాంగణంలో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలి.