
వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాధ ఆలయ ట్రస్టు దక్షిణాది వ్యవహారాల అధికార ప్రతినిధిగా తాను నియమితులైనట్లు సాదినేని యామినీ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కాశీ ఆలయకార్యకలాపాలు, సేవలను ప్రచారం చేసేందుకు శ్రీ కాశీ విశ్వనాధ ఆలయ ట్రస్టు సీఈవో విశాల్సింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.