
దేశంలో కరోనా ఉద్ధ•తి నేపథ్యంలో రానున్న వర్షకాల పార్లమెంటు సమావేశాల నిర్వహణపై సమాలోచనలు మొదలయ్యాయి. పూర్తి వర్చువల్ టెక్నాలజీతో ఈ-పార్లమెంట్ నిర్వహణ, కొందరు ప్రత్యక్షంగా సభకు హాజరుకావటం మరికొందరు ఆన్లైన్లో హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఒక మీటర్ భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణకు పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ / విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్ ఏమాత్రం సరిపోదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. భౌతిక దూరం నిబంధనల్ని పాటిస్తూ రాజ్యసభలో 60 మంది, లోక్సభ, సెంట్రల్ హాల్లో వంద మంది సభ్యులు కూర్చునే అవకాశమున్నదని, గ్యాలరీల్లో కూర్చున్నా ఇంకా మరికొందరు సభ్యులు మిగిలే ఉంటారని వివరించారు.