గూగుల్ క్లౌడ్ లోకి అనిల్ వల్లూరి

Anil Valluri Joins Google Cloud India

గూగుల్‍ క్లౌడ్‍ ఇండియా సీనియర్‍ డైరెక్టర్‍గా అనిల్‍ వల్లూరి నియమితులయ్యారు. ఇంతకుముందు ఆయన నెటయాప్‍ ఇండియా, సార్క్ దేశాల కార్యకలాపాల అధ్యక్షుడిగా పనిచేశారు. భారత్‍లోని ప్రముఖ బహుళజాతి టెక్నాలజీ సంస్థలు అనిల్‍ నాయకత్వంలో పనిచేశాయి. ఆయనకున్న అనుభవం మాకు ఎంతో విలువైనది. వ్యాపారాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలు, సాంకేతిక సవాళ్లను పరిష్కరించడంలో మాకు దోహదపడగలదు అని గూగుల్‍ క్లౌడ్‍ ఇండియా ఎండీ కరణ్‍ బజ్వా ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరిశ్రమలో క్లౌడ్‍ సేవలు కీలకమని, ఇందులో గూగుల్‍ పాత్ర ప్రధానమని ఈ సందర్భంగా వల్లూరి అన్నారు. ఈ అవకాశం తనకు రావడం పట్ల ఆనందం వెలిబుచ్చారు.