రామాలయానికి రేపు శంకుస్థాపన

foundation-stone-to-be-laid-for-ayodhya-ram-mandir-

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 10న (బుధవారం) శంకుస్థాన జరగనుంది. స్థానిక కుబేర్‍ తిల ఆలయంలో శివుడికి రుద్రాభిషేకాలు, ఇతర పూజాదికాలు నిర్వహించాగా ఉదయం 8 గంటలకు శంకుస్థాపనకు ముహూర్తాన్ని నిర్ణయించామని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధినేత మహంత్‍ నిత్య గోపాల్‍దాస్‍ వెల్లడించారు. మే 11న భూమిని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. కాగా, లాక్‍డౌన్‍తో నిలిచిపోయిన అయోధ్య రాముడి దర్శనం సోమవారం నుంచి పున ప్రారంభమైంది.