అమెరికా మార్కెట్లోకి గ్లాండ్ ఫార్మా ఔషధం

Gland Pharma launches RTU Bivalirudin Injection in US

ఫార్మా కంపెనీ గ్లాండ్‍ ఫార్మా తన భాగస్వామ్య కంపెనీలు ఎంఏఐఏ ఫార్మా ఇంక్‍, అథెనెక్స్ ఫార్మాలతో కలిసి అమెరికా మార్కెట్లో రెడీ టే యూజ్‍ శ్రేణిలోని ఘనీభవించిన బివాలిరుడిన్‍ ఇంజెక్షన్‍ విడుదల చేసింది. యూఎస్‍ ఎఫ్‍డీఏ అనుమతించిన ఆండా 505 బి(2)కు అనుగుణంగా విడుదల చేసిన తొలి ఫ్రాజెన్‍ ఇంజెక్షన్‍ ఇదేనని గ్లాండ్‍ ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన కరోనరీ వ్యాధితో బాధపడే రోగులకు చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారని గ్లాండ్‍ ఫార్మా సీఈఓ శ్రీనివాస్‍ సాదు తెలిపారు. తేలిగ్గా వినియోగించదగిన, సురక్షితమైన, తక్కువ ధర ఔషధాన్ని అందుబాటులో ఉంచుతామన్న తమ హామీకి ఇది మరింత మద్దతు చేకూరుస్తుందని భావిస్తున్నట్టు శ్రీనివాస్‍ చెప్పారు.