ఎస్‍బిఐ కస్టమర్లకు ఊరట

After deposit rate cuts in May SBI now slashes lending rates by 25 75 bps

ప్రభుత్వ రంగ ఎస్‍బిఐ కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఎస్‍బిఐ (స్టేట్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా) రుణ రేట్లలో 25 నుంచి 75 బేసిస్‍ పాయింట్ల కోత విధించింది. ఇప్పటికే మారటోరియంతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులకు దిగ్గజం బ్యాంక్‍ నిర్ణయం మరింత ఒత్తిడిలో పడేయనుంది. మే 27 నుంచి అన్ని రకాల కాలపరిమితులకు రిటైల్‍ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 40 బేసిస్‍ పాయింట్లు తగ్గించింది. దీని తర్వాత తాజాగా ఎస్‍బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో మిగులు నిధుల నిర్వహణ తీసుకుంది. పెద్ద మొత్తంలో మిగులు నిధుల నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు గాను మే నెలలో రెండు సార్లు బ్యాంక్‍ డిపాజిట్‍ రేట్లను తగ్గించింది.