
జార్జి ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఆందోళనలను అరికట్టడానికి అన్ని సమాఖ్య వనరులు, పౌర మరియు సైనిక వనరులు సమీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించారు. అలాగే వాషింగ్టన్లో నిరసనలను అదుపులో ఉంచడానికి 10 వేల మంది బలగాలను రంగంలోకి దించాలని కూడా జూన్ 1న జరిగిన సమావేశంలో ట్రంప్ కోరారు. ఈ విషయాలను వాషింగ్టన్ పోస్ట్, సిబిఎస్ న్యూస్ వెల్లడించాయి. నగరంలోని వీధులను అధీనంలోకి తెచ్చుకోవల్సిన అవసరం మనకు ఉంది. మనకు ఇక్కడ (వాషింగ్టన్)కు 10 వేల మంది బలగాలు అవసరం. ఇప్పటికే ఇప్పుడే కావాలి అని అధికారులతో ట్రంప్ పేర్కొన్నట్లు మీడియా తెలిపింది. అయితే ఈ చర్యను వ్యతిరేకంగా అధ్యక్షులు ట్రంప్‌నకు అటర్నీ జనరల్ బిల్ బ్రె, రక్షణ కార్యదర్శి మార్క్ ఈస్పెర్, జాయింట్ చీఫ్ప్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జెనరల్ మార్క్ మిల్లీ ఈ నెల 1న జరిగిన ఈ సమావేశంలో తీవ్రంగా సలహా ఇచ్చినట్లు మీడియా తెలిపారు. ఈ వార్తలపై వైట్‌హౌస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు రాలేదు.