బంకర్‍లో దాక్కోలేదు.. పరిశీలించడానికి వెళ్లా

Trump claims he went to bunker for inspection amid violent

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‍ ఉదంతం తీవ్ర అగ్రహ జ్వాలలు రగులుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అమెరికా అధ్యక్ష భవనం వైట్‍ హౌస్‍ ఎదుట కూడా నిరసన జ్వాలలు చెలరేగడంతో ఆ సెగలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు కూడా తాకాయి. దాంతో భద్రత కారణాల రీత్యా ట్రంప్‍ను అధికారులు వైట్‍ హౌస్‍లో ఉన్న హై సెక్యూరిటీ బంకర్‍ను తరలించారు. దాంతో ట్రంప్‍ దాక్కున్నాడంటూ పలు కథనాలు వచ్చాయి. తాజాగా, ఈ ఘటనపై ట్రంప్‍ స్పందించారు. తాను బంకర్‍లో దాక్కున్నట్టు వచ్చిన వార్తలను చూశానని, వాస్తవానికి తాను బంకర్‍ను పరిశీలించడానికి మాత్రమే వెళ్లానని తెలిపారు. తాను అక్కడ గడిపింది కాసేపేనని పేర్కొన్నారు. గతంలోనే అనేక పర్యాయాలు బంకర్‍లోకి వెళ్లానని, అదేమంత ముఖ్య విషయం కాదని, ఎవరైనా తన సమీపంలోకి వచ్చినా భయపడబోనని ధీమా వ్యక్తం చేశారు. కాగా, వైట్‍ హౌస్‍లోని బంకర్‍ ఏ వైపు ఉంటుందనేది అత్యంత రహస్యం. అతి కొద్ది మంది సైనిక, సీక్రెట్‍ సర్వీస్‍ అధికారులు దీనిని పర్యవేక్షిస్తుంటారు.

 


                    Advertise with us !!!