గాంధీ విగ్రహంపై దాడి...సారీ

US apologizes for the desecration of Mahatma Gandhi s statue in Washington DC

వాషింగ్టన్డీసీ ఇండియన్ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్డీసీలో జరిగిన ఘటనపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఘటనను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారుఇది కేవలం విగ్రహంపై జరిగిన దాడి కాదని..భారత సమాజంపైనా, విలువలపైనా జరిగి దాడిగా, బారత సమాజానికి జరిగిన అవమానంగా పేర్కొంటున్నారు. గాందీజీ విగ్రహ ధ్వంసం ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్చేసింది. గాంధీ విగ్రహ ధ్వంసం ఘటనపై వాషింగ్టన్పార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విగ్రహాన్ని కవర్తో కప్పి ఉంచారు. కాగా, గాంధీ విగ్రహ ధ్వంసాన్ని అమెరికా ఖండించింది. ఇందుకు క్షమాపణలు చెబుతున్నట్లు అమెరికా ప్రకటించింది. తమ క్షమాపణలు అంగీకరించాలంటూ అమెరికా అంబాసిడర్కెన్జస్టర్ట్వీట్చేశారు.